Wednesday 27 July 2011

answer this quesions any one:jai andhra

1. ప్రత్యేక తెలంగాణ కోసం వై.ఎస్.ర్ 41 మంది ఎమ్మెల్యేల చేత తీర్మానం చేసి కాంగ్రెస్‌ హై కమాండ్ కు
పంపినది నిజామా..? కాదా?(11-08-2000)
2. టి.ఆర్.ఎస్ తో 2004 లో ఏ ఉదేశ్యం పొత్తు పెట్టుకున్నారు?
3. తెలంగాణ ఇస్తమని చెప్పి మోసం చేయడం తెలంగాణ ప్రజలను వంచించడం కాదా?

4. హైదరాబాద్ చుట్టూ పక్కల ఉన్న పేదల భూములను గుంజుకుని దళారీ సంస్థలకు కట్టబెట్టడం వాస్తవం
కాదా?

5. హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద ఫార్మ మరియు కెమికల్ పరిశ్రమలలో ఎంతమంది తెలంగాణ వారికి
ఉద్యోగాలు ఇస్తున్నరు..?

6. 85 % స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న నిబంధనను సీమాంధ్ర కంపెనీలు ఎంత వరకు అమలు చేస్తున్నయ్‌..?

7. తెలంగాణను కాలుష్యకాసారంగా మార్చి తెలంగాణ సంపదను దోచుకోవడం నిజం కాదా..?

8. పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్ధాలతో తెలంగాణ పేరు తెలిని రోగాలతో బాధపడుతున్న విషయం వాస్తవమా..? కాదా..?

9. వేలాది ఎకరాల గురుకుల్ ట్రస్ట్ భూమిని దోచుకుని జయభేరీలు నిర్మించడం నిజంకాదా..?

10. ఆంధ్ర , రాయలసీమ ప్రజలకు మాత్రమే మనో భావాలు ఉంటయా..? తెలంగాణ ప్రజలకు ఉండవా?

11. ఆంధ్ర ,రాయలసీమ వలస వాదుల, పెట్టు బడిదారులు తెలంగాణ ప్రాంత సంస్కృతిని , సంపదను కొల్లగొడుతూ ఉంటే వాళ్ల నుంచి విముక్తి పొందాలకోవడం దేశద్రోహమా..?

12. విడిపోతమంటే.. కలిసుండాలనడం ఎతంవరకు సమంజసం..?

13. లగడపాటి,కావూరి, సుబ్‌బిరామిరెడ్డి లాంటి దోపిడిదారులు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం సిగ్గు అనిపించడం లేదా?

14. ఆనాడు భారతదేశానికి స్వతంత్రం ఇయ్యడానికి బ్రిటీషోడు ...ఇంగ్లాండ్ లో ఏకాభిప్రాయం అడిగిండా..?లేకుంటే భారత ప్రజల మహోన్నత పోరాటానికి తలవంచి...పారిపోయిండా..?

15. మా హైదరాబాద్ రాష్ట్రం గురించి బాలశిక్షలో ఎందుకు ఉండదు..మా రైతాంగ సాయుధ పోరాటం గురించి మీకెందుకు తెల్వదు...?

16. మాకు కరెంటు వచ్చినంక 17 ఏండ్ల తర్వాత మీరు కరెంటు కళ్ల చూసిన మాట వాస్తవమా..? కాదా..?

17. అలాంటి మీరొచ్చి మమ్మల్ని అభివృద్ధి చేసినమనడం ఎతవరకు సమంజసం..?

18. మీరొచ్చినంక హైదరాబాద్‌లో కట్టిన ప్రముఖ కట్టడాలేవైనా ఉన్నయా..?

19. మీరొచ్చి కొత్తగా కట్టిన ఓ రైల్వే స్టేషన్‌ పేరు చెప్పండి..?

20. సీమాంధ్ర పెట్టుబడి దారులు అప్పణంగా తెలంగాణ భూములను కొల్లగొడుతున్న మాట నిజం కాదా..?

No comments:

Post a Comment